Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్యాంగ్ రేప్ నిందితులకు ఈ శిక్ష సరిపోతుందా?... మీరే చూసి చెప్పండి!

  • యువతిపై అత్యాచారం చేసిన నలుగురు
  • భోపాల్ నడి వీధుల్లో తిప్పి అమ్మాయిలతో కొట్టించిన పోలీసులు
  • కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడి
వారు నలుగురు యువకులు. నలుగురూ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారే. వారికి భోపాల్ పోలీసులు ఓ వినూత్న శిక్ష విధించారు. అయితే, అబలపై అత్యాచారానికి పాల్పడిన వారికి ఈ శిక్ష సరిపోతుందా? ఇంతకన్నా పెద్ద శిక్షలు లేవా? అన్నది ఇప్పుడు నెట్టింట సాగుతున్న చర్చ. ఇంతకీ పోలీసులు ఏం చేశారో తెలుసా? నలుగురు నిందితుల చేతులకు బేడీలు వేసి నడిరోడ్డుపై తిప్పుతూ, జంక్షన్ల వద్ద వారిచేత గుంజీలు తీయించారు. మహిళలతో చెంపదెబ్బలు కొట్టించారు.

 పోలీసులు చేసిన ఈ పనికి చాలా మందికి ఆనందం కలిగించినా, వారిని బట్టలతో ఎందుకు తిప్పించారని, అర్థనగ్నంగా ఎందుకు తిప్పలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక వారిని రోడ్లపైకి తెచ్చినప్పుడు పలువురు యువతులు వారిని కర్రలు, చెప్పులు తీసుకుని దేహశుద్ధి చేయగా, పనిలో పనిగా కొందరు మహిళా పోలీసులూ వారిని దండించారు. ఇక అత్యాచారం చేసిన కామాంధులకు ఈ శిక్ష సరిపోతుందా?... నెటిజన్ల నుంచి ఎదురైన ఈ ప్రశ్నకు పోలీసు అధికారులు సమాధానం ఇస్తూ, వీరిపై నిర్భయ కేసు పెట్టామని, కఠిన శిక్ష పడేలా చూస్తామని, ఇతర రేపిస్టులకు బుద్ధి రావాలనే ఈ పని చేశామని అంటున్నారు.
Gang Rape
Bhopal
Police

More Telugu News